బ్యాంక్‌ ఉద్యోగిని కొట్టిన కస్టమర్

Customer Thrashes Bank Employee In Gujarat Over Loan Dispute. గుజరాత్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఉద్యోగిని ఓ కస్టమర్ కొట్టిన ఘటనకు

By Medi Samrat
Published on : 6 Feb 2023 6:05 PM IST

బ్యాంక్‌ ఉద్యోగిని కొట్టిన కస్టమర్

గుజరాత్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఉద్యోగిని ఓ కస్టమర్ కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నదియాడ్ బ్రాంచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ లోన్ విషయంలో వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో, ఇద్దరు వ్యక్తులు బ్యాంక్ బ్రాంచ్‌లోకి ప్రవేశించడం కనిపించింది. వారిలో ఒకరు బ్యాంకు ఉద్యోగిని కొట్టడం ప్రారంభించాడు.

ఫిబ్రవరి 3 నాటి CCTV ఫుటేజీలో.. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ తన చైర్ లో కూర్చున్నాడు. అకస్మాత్తుగా, ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించి అతని వైపు నడిచారు. వారిలో ఒకరు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ని చెంపదెబ్బలు కొట్టడం, తన్నడం ప్రారంభించాడు. బ్యాంకు వద్ద ఉన్న కొంతమంది ఖాతాదారులు, సిబ్బంది ఉద్యోగిని రక్షించడానికి ఆపడానికి ముందుకు వచ్చారు. అయినప్పటికీ సదరు వ్యక్తి ఉద్యోగిని కొడుతూనే ఉన్నాడు. అనంతరం భద్రతా సిబ్బంది అత‌డిని తీసుకెళ్లారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఎస్సీ-ఎస్టీ (అట్రాసిటీ నిరోధక చట్టం) కింద నదియాడ్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ప్రారంభించినట్లు వార్తా సంస్థ పేర్కొంది.

Next Story