ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

CRPF jawan killed in terrorist fire in Pulwama. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆదివారం

By Medi Samrat  Published on  17 July 2022 4:19 PM IST
ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆదివారం మ‌ధ్యాహ్నం ఉగ్ర‌వాదుల కాల్పుల‌కు బ‌ల‌య్యారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్‌ నాకా పార్టీ (చెక్‌పోస్ట్)పై ఉగ్రవాదులు జ‌రిపిన కాల్పుల్లో ఏఎస్సై మరణించారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని యాపిల్ తోట నుండి చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘ‌ట‌న‌లో సీఆర్పీఎఫ్ అధికారి గాయ‌న‌డిన‌ట్లు అధికారులు మీడియాకు తెలిపారు. గాయపడిన అధికారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌న‌తో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులను కనుగొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.








Next Story