టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. ఈ మేరకు అతడికి పార్టీ అధిష్టానం ఇచ్చిన సభ్యత్వాన్ని అతడి భార్య ఎక్స్‌లో షేర్ చేసింది. రవీంద్ర జడేజా భార్య ఇప్పటికే బీజేపీలో ఉన్నారు. ఆమె గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ సీటు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడేజా తన భార్యతో పలు రోడ్ షోలలో కూడా పాల్గొన్నారు. తాజాగా జడేజా బీజేపీలో చేరడం ద్వారా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అయితే పార్టీలో ఆయన పాత్ర ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జడేజా భార్య రివాబా 2019లో బీజేపీ పార్టీలో చేరారు. పార్టీ 2022 లో జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి ఆమెను పోటీకి దింపింది. ఆమె కర్షన్‌భాయ్ కర్మూర్‌ను ఓడించి అక్కడ గెలిచింది.
రవీంద్ర జడేజా T20 ప్రపంచకప్ 2024 తర్వాత T20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. జడేజా భారత్ తరఫున 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 515 పరుగులు చేయడంతోపాటు 54 వికెట్లు కూడా తీశాడు. టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జడేజా వన్డేలు, టెస్టులు ఆడనున్నాడు. ఇటీవల, రవీంద్ర జడేజా దులీప్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్లే జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని అంతా భావించారు.