బిహార్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమైంది: సీఎం నితీశ్ కుమార్
Covid third wave has begun in Bihar.. CM Nitish Kumar. బీహార్ రాష్ట్రంలో కోవిడ్ -19 మహమ్మారి యొక్క థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.
By అంజి Published on 29 Dec 2021 11:21 AM ISTబీహార్ రాష్ట్రంలో కోవిడ్ -19 మహమ్మారి యొక్క థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 47 కొత్త కోవిడ్ కేసులు నమోదైన తర్వాత ఇది జరిగింది. దేశంలో కరోనావైరస్ యొక్క కొత్త ఓమిక్రాన్ వేరియంట్ యొక్క పెరుగుతున్న కేసుల మధ్య, ఉత్తరప్రదేశ్ వంటి పొరుగు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలకు వెళ్ళడానికి దారితీసింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాత్రిపూట కర్ఫ్యూల గురించి అడిగినప్పుడు "యహాన్ అభి కోయి అవశ్యక్తా నహీం హైం" (ప్రస్తుతం ఇక్కడ ఇది అవసరం లేదు) అని నితీష్ కుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. కరోనా నుండి ప్రజలను రక్షించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 96వ జాతీయ సదస్సును ప్రారంభిస్తూ.. మహమ్మారి చివరి రెండు వేవ్‌ల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించడంలో వైద్యుల పాత్రను నితీష్ ప్రశంసించారు.
"వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అవిశ్రాంతంగా పనిచేశారు. కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్‌లు రాష్ట్రాన్ని తాకినప్పుడు కోవిడ్ రోగులకు చికిత్స చేశారు. వారు అన్ని ప్రశంసలకు అర్హులు" అని నితీష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడో విడత మహమ్మారి విజృంభిస్తున్నందున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరిచే పనిలో నిమగ్నమై ఉందని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడా నితీశ్ సభకు వివరించారు. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 5,400 పడకలతో ప్రపంచ స్థాయి సౌకర్యంగా అభివృద్ధి చేయబడుతోంది. రాష్ట్రంలోని ఎన్‌ఎంసిహెచ్‌తో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను కూడా పెంచుతున్నారు అని నితీశ్ తెలిపారు. కొత్త విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పడకల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని సీఎం చెప్పారు.
వైద్యరంగానికి పూర్తి ప్రభుత్వ సహకారం అందిస్తామని నితీశ్ హామీ ఇస్తూనే, మద్యం సేవించడం, బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. వైద్యులు సమాజంలో విశిష్టమైన స్థితిని సంపాదిస్తారు. విలువైన ప్రాణాలను కాపాడినందుకు ప్రజలు "దేవుడు"గా భావిస్తారు కాబట్టి, వారు సామాజిక దురాచారాలపై సమాజంలో చైతన్యం తీసుకురావడానికి దోహదం చేస్తారని ఆయన అన్నారు.