సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన న్యాయస్థానం
Court reserves verdict on Sisodia's bail plea. ఢిల్లీలోని మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై
By Medi Samrat Published on 18 April 2023 1:00 PM GMTManish Sisodia
ఢిల్లీలోని మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఏప్రిల్ 26 సాయంత్రం 4 గంటలకు కోర్టు తీర్పు వెలువరించనుంది.
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారించింది. ఈ సందర్భంగా సిసోడియా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. మంత్రుల బృందం, కేబినెట్‌లో ఏం జరిగిందో చెప్పడం ఈడీ పని కాదని అన్నారు. ఏదైనా నేరం జరిగితే దాని వల్ల ఎవరు లాభపడ్డారో చెప్పడమే ఈడీ పని. కేవలం ఊహాగానాల ఆధారంగా సిసోడియాను కస్టడీలో ఉంచలేమని మనీష్ సిసోడియా తరపు న్యాయవాది దయన్ కృష్ణన్ అన్నారు.
ఈడీ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈరోజు పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. ఏప్రిల్ 26న సాయంత్రం 4 గంటలకు మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులపై కోర్టు తీర్పు వెలువరించనుంది.
మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఏప్రిల్ 12న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టులో వాదనలు వినిపించింది. ఎక్సైజ్ పాలసీని సవరించి అమలు చేయడంలో మనీష్ సిసోడియా కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. ఎక్సైజ్ శాఖలో పాలసీ ముసాయిదా తర్కం పూర్తిగా తప్పుడుదని ఈడీ కోర్టులో వాదించింది.
సీబీఐ కేసులో ప్రత్యేక కోర్టు కూడా మార్చి 31న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. మనీష్ సిసోడియా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఏప్రిల్ 17 సోమవారం సీబీఐ కేసులో సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఏప్రిల్ 27 వరకు పొడిగించగా.. ఈడీ కేసులో కోర్టు ఆయన కస్టడీని ఏప్రిల్ 29 వరకు పొడిగించింది.