మనీష్ సిసోడియాకు దక్కని ఊరట

No Relief For Manish Sisodia, To Stay In Jail Till April 17 In Delhi Excise Policy Case. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాకు

By Medi Samrat
Published on : 5 April 2023 2:33 PM

మనీష్ సిసోడియాకు దక్కని ఊరట

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాకు మద్యం పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఉపశమనం లభించలేదు. రూస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 5న అతని జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17 వరకు పొడిగించడంతో ఆయనకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం తీహార్ జైలులో గడుపుతూ ఉన్నారు.

దర్యాప్తు కీలక దశలో ఉందని, జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు కస్టడీని పొడిగించింది. మరో వైపు సీబీఐ విచారిస్తున్న ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 12న విచారణ జరుగనుంది. మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరి 26న మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయనను జ్యుడీషియల్‌ కస్టడీపై జైలుకు పంపింది.


Next Story