ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన బెయిల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మనీశ్ సిసోడియా బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఏప్రిల్ 5కు వాయిదా చేసినట్లు కోర్టు స్పష్టం చేసింది.
లిక్కర్ స్కామ్ లో కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నానని.. సహకరిస్తూ ఉన్నా కూడా తనను జైలులో ఉంచాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. స్పెషల్ జడ్జ్ నాగ్‌పాల్ శనివారం జరగాల్సిన ఈ విచారణను వాయిదా వేశారు. దీనిపై ఈడీ వివరణ ఇచ్చిన తరవాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.