మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

Manish Sisodia's ED custody extended by 5 days. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కస్టడీని పొడిగించారు.

By Medi Samrat  Published on  17 March 2023 12:45 PM GMT
మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

Manish Sisodia


ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కస్టడీని పొడిగించారు. మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. నేటితో ఈడీ కస్టడీ ముగియగా, ఆయనను కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం సిసోడియాకు 5 రోజుల కస్టడీ విధించింది. దాంతో ఈ నెల 22 వరకు సిసోడియా ఈడీ కస్టడీలో ఉండనున్నారు. మార్చి 22న మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను తమ ఎదుట హాజరు పరచాలని స్పెషల్ జడ్జి ఎంకే నాగ్ పాల్ ఈడీ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఫిబ్రవరి 26న ఆయనను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Next Story