సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర'

Congress to launch ‘Bharat Jodo Yatra’ from September 7. సెప్టెంబర్ 7 నుంచి 'భారత్‌ జోడో యాత్ర' ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ ఇవాళ ప్రకటించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు

By అంజి  Published on  9 Aug 2022 9:17 AM GMT
సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర

సెప్టెంబర్ 7 నుంచి 'భారత్‌ జోడో యాత్ర' ప్రారంభమవుతుందని కాంగ్రెస్‌ ఇవాళ ప్రకటించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగుతుందని, యాత్రలో రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపింది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ మాట్లాడుతూ.. 80 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి ఐదేళ్ల తర్వాత దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిందని అన్నారు. "భారత జాతీయ కాంగ్రెస్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7, 2022 నుండి ప్రారంభించనుంది" అని ఆయన తెలిపారు.

ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుందని తెలిపారు. పాదయాత్ర దాదాపు 3,500 కిమీల పొడవు ఉంటుందని, దాదాపు 150 రోజుల్లో పూర్తవుతుందని జైరామ్‌ రమేష్ చెప్పారు. భయం, మతోన్మాదం,దురభిమాన రాజకీయాలకు, జీవనోపాధి విధ్వంసం, పెరుగుతున్న నిరుద్యోగం,పెరుగుతున్న అసమానతలకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఒక భారీ జాతీయ ప్రయత్నంలో భాగం కావాలనుకునే ప్రతి ఒక్కరూ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తోంది. ఈ యాత్ర కోసం సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​తో కూడిన కమిటీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షిస్తోంది. కమిటీలో శశి థరూర్​, సచిన్​ పైలట్​, జ్యోతి మణి, జీతు పట్వారి, సలీం అహ్మద్​లు భగంగా ఉన్నారు. దేశం ఐకమత్యంతో వర్ధిల్లాని ఈ యాత్ర ద్వారా చాటిచెప్పేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోంది. స్వతంత్ర భారత దేశంలో కాంగ్రెస్​ చేపట్టనున్న జాతీయ స్థాయి 'యాత్ర​' ఇదే కావడం గమనార్హం. యాత్రలో భాగంగా కాంగ్రెస్​ నేతలు.. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా, పంజాబ్​లో పాదయత్ర చేస్తారు.

Next Story