వారికి వార్నింగ్ ఇచ్చిన సోనియా గాంధీ

Congress president Sonia Gandhi at key AICC meet. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే మునిగిపోతున్న నావతో పోల్చుతూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో కేడర్ ఉన్నా

By Medi Samrat  Published on  26 Oct 2021 7:01 PM IST
వారికి వార్నింగ్ ఇచ్చిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే మునిగిపోతున్న నావతో పోల్చుతూ ఉన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో కేడర్ ఉన్నా కూడా నిలదొక్కుకోలేకపోతోంది. కార్యకర్తలను దిశానిర్దేశం చేసే నాయకులే లేకుండా పోయారు. ఇక ఎన్నో రాష్ట్రాలతో సీనియర్లు, జూనియర్లు అంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ను కాపాడుకోడానికి సోనియా గాంధీ దిగారు. కాంగ్రెస్ నేతలు గొడవపడడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. అందరూ క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉందని.. వ్యక్తిగత లక్ష్యాలు, స్వార్థ ప్రయోజనాలను దూరం పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఉన్నత స్థాయి నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ దుష్ట చర్యలపై బాధితుల తరఫున పోరాటాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని.. వివిధ రాష్ట్రాల్లోని నేతల మధ్య సహకారం కొరవడిందని, వారిమధ్య వారికే స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలపై పోరాటంలో నేతలకు స్పష్టత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నేతలందరూ ఐకమత్యంతో మెలగాలని, క్రమశిక్షణను అలవర్చుకోవాలని తేల్చి చెప్పారు. పార్టీ మెరుగైన స్థానంలో ఉన్నప్పుడే నేతలూ మంచి స్థానాల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాధాన్యపరంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణను ఇవ్వాలని నేతలకు సోనియా సూచించారు.


Next Story