ఆ అత్యాచార బాధితురాలి తల్లికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్
Congress nominates Unnao rape survivor's mother as candidate in Uttarpradesh polls. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జాతీయ పార్టీలతో పాటు
By అంజి Published on 13 Jan 2022 2:03 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలతో ప్రచారం మొదలు పెట్టాయి. అలాగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కాంక్షతో.. ఆయా పార్టీలు అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నాయి. తాజాగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నామినేట్ చేసింది. ఉన్నావ్ కుమార్తెకు బీజేపీ అన్యాయం చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. "ఇప్పుడు బాధితురాలి తల్లి న్యాయం యొక్క ముఖం అవుతుంది" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు.
2019లో బీజేపీ బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2017లో యుక్తవయసులో ఉన్న బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా నిర్ధారించబడి జీవిత ఖైదు విధించబడింది. పోలీసుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి వెలుపల అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన తర్వాత ఉన్నావ్ రేప్ కేసు జాతీయ అంశంగా మారింది. కులదీప్ సెంగార్‌పై ఆరోపణలు తెరపైకి వచ్చిన వెంటనే, అత్యాచార బాధితురాలి తండ్రిని అక్రమాయుధాల కేసు కింద అరెస్టు చేశారు. కస్టడీలో చిత్రహింసల కారణంగా పోలీసు కస్టడీలో మరణించాడు. 2020లో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించి కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించబడింది.
జూలై 2019లో, ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఇతర కుటుంబ సభ్యులు మరియు ఆమె లాయర్‌తో కలిసి ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆమె తన మామను కలిసేందుకు ఉన్నావ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి వెళుతోంది. ఈ ప్రమాదంలో న్యాయవాది సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. లక్నోలోని ఒక ఆసుపత్రి నుండి ఆమెను హెలికాప్టర్‌లో తరలించి, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన సంరక్షణ కోసం ఎయిమ్స్‌కి తీసుకువచ్చారు. ఉన్నావ్ రేప్ బాధితురాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తనను చంపాలని భావించిన బిజెపి మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఈ ప్రమాదం వెనుక ఉన్నారని పేర్కొంది. మార్చి 2020లో, అత్యాచార బాధితురాలి తండ్రి మరణించినందుకు కుల్దీప్ సెంగార్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అయితే, ఉన్నావ్ రేప్ బాధితురాలి కుటుంబానికి జరిగిన ప్రమాదంలో హత్య కేసులో ఢిల్లీ కోర్టు కుల్దీప్ సింగ్ సెంగార్‌ను విడుదల చేసింది.