మాజీ ప్రధాని నరసింహారావును భారతరత్నతో సత్కరించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని ప్రకటన తర్వాత కాంగ్రెస్ నుంచి తొలి స్పందన వచ్చింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీని ఈ విషయమై విలేకరులు ప్రశ్నలు అడగగా.. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆమె అన్నారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో సోనియా గాంధీని జర్నలిస్టులు ప్రశ్నలు అడగగా.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ విషయమై బీజేపీ నేత, పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ కూడా ప్రకటన చేశారు. మాజీ ప్రధానికి భారతరత్న ఇచ్చే విషయాన్ని ప్రధాని మోదీ తెలియజేశారని.. పీవీ నరసింహరావు కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో భారతరత్ననే కాదు మరే అవార్డునైనా ఆయనకు ప్రకటించే విషయాన్ని వారు మర్చిపోయారన్నారు.