తన కుమారుడు బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ స్పందిచారు. బీజేపీలో చేరాలని అనిల్ తీసుకున్న నిర్ణయం తనను బాధించిందన్నారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. మోదీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని, అలాంటి పార్టీలో తన కుమారుడు చేరడం తప్పుడు నిర్ణయం అన్నారు.
ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన బిబిసి డాక్యుమెంటరీని విమర్శిస్తూ అనిల్ ఆంటోనీ ఇంతకు ముందు ట్వీట్ చేశారు. జనవరిలో కాంగ్రెస్‌లోని అన్ని బాధ్యతలకు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వి మురళీధరన్, బిజెపి కేరళ యూనిట్ చీఫ్ కె సురేంద్రన్ అధికారిక కార్యక్రమంలో బీజేపీ లోకి స్వాగతించారు. అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీని వీడే ముందు కేరళలో కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ బాధ్యతలు చూసుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం అనిల్ ఆంటోని మాట్లాడుతూ చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఓ కుటుంబం కోసం పని చేయడమే తమ కర్తవ్యం అని భావిస్తున్నారు. కానీ ప్రజల కోసం పని చేయడమే నా కర్తవ్యం అని గుర్తించానని అన్నారు.