కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. కీల‌క నేత రాజీనామా

Congress's AK Antony's Son Quits Party. కాంగ్రెస్ కురువృద్ధుడు ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ కాంగ్రెస్ పార్టీని వీడారు.

By Medi Samrat  Published on  25 Jan 2023 7:07 PM IST
కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. కీల‌క నేత రాజీనామా

కాంగ్రెస్ కురువృద్ధుడు ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ కె ఆంటోనీ కాంగ్రెస్ పార్టీని వీడారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీసిన బీబీసీ డాక్యుమెంటరీని ప్రమాదకరమైన దృష్టాంతం అని ఖండించారు. ట్వీట్‌ను ఉపసంహరించుకోకపోవడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కేరళలోని కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌లో భాగమైన అనిల్ ఆంటోనీ, తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పంచుకున్నారు. మోదీకి మద్దతు తెలిపినందుకు తనకు రాత్రిపూట పలు బెదిరింపు కాల్స్, ద్వేషపూరిత సందేశాలు వచ్చాయని కూడా అనిల్ కె ఆంటోనీ ఆరోపించాడు. "గత 24 గంటల్లో జరిగిన చాలా విషయాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న ఘటనలు నన్ను చాలా బాధించాయి" అని ఆయన వార్తా సంస్థ ANI కి చెప్పారు.

పార్టీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ అనిల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ప్రధాని మోదీని విమర్శించే డాక్యుమెంటరీపై ఆందోళన వ్యక్తం చేసిన అనిల్ కె ఆంటోనీ.. పార్టీ తీరు బాధకలిగించిందని అన్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇలాంటివి రాజకీయాల్లో తగదంటూ అనిల్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. కేరళ కాంగ్రెస్ లోని తన పదవులన్నింటికీ రాజీనామా చేశానని ఈ సందర్భంగా ప్రకటించారు.

Next Story