ఏకంగా ప్రధాని మోదీపైనే రెండు ఫిర్యాదులు

తమ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

By Medi Samrat  Published on  8 April 2024 2:15 PM GMT
ఏకంగా ప్రధాని మోదీపైనే రెండు ఫిర్యాదులు

తమ పార్టీ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో 'న్యాయ్ పత్ర్ ' ను ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం లీగ్ తో పోల్చడంపై కాంగ్రెస్ హైకమాండ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 6న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లోని ప్రతి పేజీ భారతదేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నాన్ని తలపిస్తోందని అన్నారు.

కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిందని, ఆరు ఫిర్యాదులు చేశామని.. అందులో రెండు ఫిర్యాదులు ప్రధాని మోదీపై ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేశ్ అన్నారు. ఎన్నికల సంఘం తాను స్వతంత్ర సంస్థనని చాటుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అన్ని పార్టీలు సమానమే అని చాటి చెప్పాల్సిన తరుణం ఇదేనని, ఈసీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి, ఈ అంశంలో చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు.

Next Story