ఆయ‌న‌ వ్యాఖ్యలకు, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదట..!

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) చైర్మన్ శామ్ పిట్రోడా తాజాగా చైనాపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు.

By Medi Samrat  Published on  17 Feb 2025 8:13 PM IST
ఆయ‌న‌ వ్యాఖ్యలకు, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదట..!

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) చైర్మన్ శామ్ పిట్రోడా తాజాగా చైనాపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆగ్రహం వ్యక్తం చేసింది. శామ్ పిట్రోడా భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించాడని, కాంగ్రెస్ తరహాలో చైనా అనుకూల వైఖరిని ప్రదర్శించాడని ఆరోపించింది.

శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. అతడి సొంత అభిప్రాయాలు 'పార్టీ అభిప్రాయాలు కాదు' అని తేల్చి చెప్పింది. వార్తా సంస్థ IANSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిట్రోడా మాట్లాడుతూ చైనాను ముప్పుగా భావించడాన్ని ప్రశ్నించారు. భారత్‌ తన వైఖరి మార్చుకొని చైనాను శత్రువులా చూడటం మానుకోవాలని సూచించారు. తొలినుంచి చైనాతో భారత్‌ అనుసరిస్తున్న ఘర్షణాత్మక వైఖరి ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోందని శామ్‌ పిట్రోడా అన్నారు. చైనా నుంచి భారత్‌కు ఏం ముప్పుందో తనకు అర్థం కావడం లేదన్నారు.కమాండ్ అండ్ కంట్రోల్ మైండ్‌సెట్‌తో పనిచేయడం కంటే మనం కమ్యూనికేషన్, సహకరించడం, సహ-సృష్టిని పెంచుకోవాలని పిట్రోడా హితవు పలికాడు. "చైనా విషయంలో పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ దృక్పథం కాదు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాన్ని ప్రతిబింబించవు. విదేశాంగ విధానం, భద్రత, ఆర్థిక అంశాల్లో చైనా ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉంది" అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ వివరణ ఇచ్చారు.

Next Story