కాంగ్రెస్ అభ్య‌ర్ధుల తొలి జాబితా ప్ర‌క‌ట‌న ఎప్పుడో చెప్పిన సీఎం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల న‌గ‌రా సోమవారం అధికారికంగా మోగింది. ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత బీజేపీ 41 స్థానాలకు

By Medi Samrat  Published on  10 Oct 2023 7:03 PM IST
కాంగ్రెస్ అభ్య‌ర్ధుల తొలి జాబితా ప్ర‌క‌ట‌న ఎప్పుడో చెప్పిన సీఎం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల న‌గ‌రా సోమవారం అధికారికంగా మోగింది. ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత బీజేపీ 41 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. కాంగ్రెస్ తొలి జాబితా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన గెహ్లాట్ అక్టోబర్ 18 నాటికి టిక్కెట్లను ఖరారు చేయవచ్చని సూచించారు. అభ్య‌ర్ధుల ఎంపిక‌ ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించామని ముఖ్యమంత్రి గెహ్లాట్ తెలిపారు. సీఈసీ సమావేశం ఉంటుంది. దీని తర్వాతే ఫైనల్‌గా ఏదైనా జరగనుంది. దాదాపు 18వ తేదీలోగా టిక్కెట్లు ఖరారు కావచ్చని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత సీఎం గెహ్లాట్.. సోనియా గాంధీ భేటీపై మీడియా ప్రశ్నలు సంధించింది. దీనిపై గెహ్లాట్ మాట్లాడుతూ.. సోనియాజీ కాంగ్రెస్ నేత అని అన్నారు. ఆమె చాలా కాలం పాటు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. వారిని మర్యాదపూర్వకంగా కలవడం మన కర్తవ్యం. నేను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఆమెను కలుస్తాను. ఆమె ఆశీస్సులతోనే నేను ఇక్కడి వ‌ర‌కూ చేరుకున్నాను. ఆమె ఆశీర్వాదం వ‌ల్లే నేను మూడుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిని అయ్యాను. 25 ఏళ్లుగా ఆమె నన్ను నమ్ముతున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై సీఎం అశోక్ గెహ్లాట్ మరోసారి విరుచుకుపడ్డారు. గెహ్లాట్ మాట్లాడుతూ.. బీజేపీ మినహా ఏ పార్టీకి నిధులు అందడం లేదన్నారు. ఎవ‌రైనా మమ్మల్ని కలవడానికి వచ్చినా.. ఆదాయపు పన్ను (ఐటి) శాఖ, ఈడీ నుంచి వ్యక్తులు సాయంత్రం వారి ఇంటికి చేరుకుంటారు. మేము ఇటువంటి వాతావరణంలో పని చేస్తున్నాము. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు.

Next Story