మిమ్మల్ని మీరు మార్చుకోండి.. లేదంటే మార్పులు వస్తాయి.. ఎంపీలకు ప్రధాని మోడీ వార్నింగ్‌.!

Change Yourself Or There'll Be Changes, PM Warns BJP MPs. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలకు సక్రమంగా హాజరుకావడం లేదు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఎంపీలకు వార్నింగ్‌ ఇచ్చారు.

By అంజి  Published on  7 Dec 2021 6:38 AM GMT
మిమ్మల్ని మీరు మార్చుకోండి.. లేదంటే మార్పులు వస్తాయి.. ఎంపీలకు ప్రధాని మోడీ వార్నింగ్‌.!

బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాలకు సక్రమంగా హాజరుకావడం లేదు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఎంపీలకు వార్నింగ్‌ ఇచ్చారు. "మిమ్మల్ని మీరు మార్చుకోండి" లేదా మార్పులు వస్తాయి" అంటూ హెచ్చరించారు. క్రమశిక్షణతో, సమయపాలనతో మెలగాలని తమ పార్టీ ఎంపీలు, మంత్రులకు పదే పదే సూచించిన 'పిల్లల్లాగా' ప్రవర్తిస్తున్నారని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దయచేసి పార్లమెంట్‌ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని కోరారు. ఈ విషయం గురించి ప్రతిసారి మిమ్మల్ని తాను పిల్లల్లాగా ట్రీట్‌ చేయడం మంచిది కాదన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే.. తగిన సమయంలో మార్పులు వస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సహా సీనియర్ మంత్రులు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.

శనివారం నాడు నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్‌లో 14 మంది పౌరుల మరణాలతో సహా వివిధ సమస్యలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో బిజెపి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. ఈ వింటర్‌ సెషన్‌కు 12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కూడా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతకుముందు జరిగిన సెషన్‌లో చివరి రోజు జరిగిన గందరగోళంలో గందరగోళం సృష్టించినందుకు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం కాగా.. డిసెంబర్ 23 వరకు కొనసాగనున్నాయి. ఉభయ సభలు ఇప్పటి వరకు పలుమార్లు వాయిదా పడ్డాయి. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి సిద్ధమవుతున్న తరుణంలో ఎంపీలను మోడీ మందలించినట్లు తెలుస్తోంది.

Next Story