గోదాములపై సీబీఐ దాడులు

CBI Raids 45 Godowns In Punjab, Haryana Samples Of Rice And Wheat Stocks Seized. ఒక వైపు పంజాబ్‌, హర్యానాకు చెందిన రైతులు

By Medi Samrat  Published on  29 Jan 2021 8:48 PM IST
గోదాములపై సీబీఐ దాడులు

ఒక వైపు పంజాబ్‌, హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతుంటే, మరో వైపు ఈ రెండు రాష్ట్రాల్లోని సుమారు 45 గోదాములపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బియ్యం, గోధుమ నిల్వల శాంపిళ్లను సీజ్‌ చేసింది. పారామిలటరీ బలగాల సహాయంతో గురువారం రాత్రి నుంచి సీబీఐ ఈ దాడులను జరుపుతోంది.

పంజాబ్‌ గైన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కార్పొరేషన్‌, పంజాబ్‌ వేర్‌ హౌసింగ్‌, కొన్ని ఎఫ్‌ఐసీఐకి చెందిన గోదాములపై ఈ దాడులు జరిగాయి. ఈ గోదాములలోని సెంట్రల్ పూల్‌ ఆహార ధాన్యాల నిల్వల, నాణ్యత, పరిమాణాన్ని సీబీఐ తనిఖీలు చేపడుతోందని సీబీఐ అధికారులు తెలిపారు. 2019-20, 2020-21 సంవత్సరానికి సంబంధించి సెంట్రల్‌ పూల్‌ నిల్వలను ఈ గోదాములలో నిల్వ చేసినట్లు చెప్పారు. పంజాబ్‌లోని లూథియానాలో తొమ్మిది గోదాములు, మన్సా, కపుర్తలాలోని ఒక్కో గోదాములలో తనిఖీలు జరిపారు. అలాగే హర్యానాలోని సాహ్‌బాద్‌, సిర్సాలోనూ సీబీఐ దాడులు చేస్తోంది.

కాగా, కేంద్రానికి పంపేందుకు స్టాకిస్టులు యూపీ, బీహార్‌ నుంచి ధాన్యం సేకరిస్తుంటారని, ఇదే సమయంలో నాణ్యత కలిగిన ఆహార ధాన్యాలను ఓపెన్‌ మార్కెట్లో అమ్ముతుంటారని మాన్సా ఎఫ్‌సీఐ గోదాముల వర్గాలు చెబుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్న బియ్యం సరఫరా అవుతుందన్న సమాచారంతో సీబీఐ దాడులు చేపట్టింది. కాగా, సేకరించిన ఆహార ధాన్యాల విషయంలో క్వాలిటీ తనిఖీలను త్వరలోనే ప్రభుత్వం చేపట్టనున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందట కూడా సీబీఐ ఇలాంటి దాడులే జరుపుతోంది.


Next Story