31 ఏళ్ల కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఇప్పటివరకు సీబీఐ నిర్వహించిన దర్యాప్తులో ఆమె సామూహిక అత్యాచారానికి గురికాలేదని ఇండియా టుడే కథనంలో తెలిపింది. ఆగస్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన హత్య, అత్యాచారం కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే ఆమె హత్య వెనుక ఉన్నాడని దర్యాప్తు సూచిస్తుంది. ఫోరెన్సిక్ నివేదిక, మూలాల ప్రకారం సంజయ్ రాయ్ డాక్టర్ ను అత్యాచారం చేసి చంపాడు. DNA నివేదిక కూడా కేవలం ఒక వ్యక్తి ప్రమేయాన్ని ధృవీకరించింది.
ఆసుపత్రి సెమినార్ హాల్‌లో నగ్నంగా ఉన్న వైద్యురాలి మృతదేహం లభ్యమైన ఒక రోజు తర్వాత సంజయ్ రాయ్‌ను ఆగస్టు 10న అరెస్టు చేశారు. డాక్టర్ హత్యకు గురైన భవనంలోకి రాయ్ ప్రవేశించినట్లు చూపించిన సీసీటీవీ ఫుటేజీని కూడా సీబీఐ పరిశీలించింది. గృహహింస చరిత్ర కలిగిన, ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు యాక్సెస్ కలిగి ఉన్న రాయ్ కు సంబంధించిన బ్లూటూత్ హెడ్‌సెట్ ఘటన జరిగిన స్థలంలో కనుగొన్న తర్వాత అరెస్టు అయ్యాడు.