578 కార్టన్‌ల మద్యం సీసాలు మాయం.. మహిళా పోలీస్‌పై కేసు నమోదు

Case Against Cop After 578 Cartons Of Wine Go Missing In UP. పెద్ద మొత్తంలో వైన్‌ కార్టన్లు మాయం కావడంతో మహిళా పోలీస్‌పై కేసు నమోదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

By అంజి  Published on  4 Dec 2021 4:35 PM IST
578 కార్టన్‌ల మద్యం సీసాలు మాయం.. మహిళా పోలీస్‌పై కేసు నమోదు

పెద్ద మొత్తంలో వైన్‌ కార్టన్లు మాయం కావడంతో మహిళా పోలీస్‌పై కేసు నమోదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కైరానా పోలీస్‌స్టేషన్‌ గోదాంలో 578 కార్టన్‌ల వైన్‌ కనిపించకుండా పోవడంతో ఓ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఇటీవల ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో పట్టుబడిన 12 కేసులకు సంబంధించిన మద్యం సీసాల బాక్సులను కైరానా పీఎస్ వేర్‌ హౌస్‌లో పెట్టారు. దీనికి మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ తారేశ్‌ శర్మను ఇంచార్జ్‌ పెట్టారు. అయితే ఆమె ఇటీవల బదిలీ అయ్యింది. దీంతో ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించారు. ఈ క్రమంలోనే పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన 578 కార్టన్ల వైన్‌ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.

పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశం మేరకు హెడ్ కానిస్టేబుల్ తారేష్ శర్మపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (ప్రభుత్వ సేవకుడి నమ్మకాన్ని ఉల్లంఘించడం) కింద అభియోగాలు మోపి కేసు నమోదు చేశారు. 12 కేసుల్లో స్వాధీనం చేసుకున్న వైన్ మిస్సింగ్‌కు మహిళా కానిస్టేబుల్‌ తారేశ్‌ శర్మ బాధ్యత వహించారని సర్కిల్ అధికారి ప్రదీప్ సింగ్ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌ని బదిలీ చేయడంతోపాటు తదుపరి అధికారికి బాధ్యతలు అప్పగించే సమయంలో 578 కార్టన్‌ల వైన్‌ కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Next Story