న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టిన బీఎస్పీ అధినేత్రి

BSP dissolves entire executive body after its humiliating defeat in UP polls. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరమైన ప‌రాజ‌యం తర్వాత మాయావతి నేతృత్వంలోని

By Medi Samrat  Published on  27 March 2022 4:10 PM IST
న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టిన బీఎస్పీ అధినేత్రి

2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరమైన ప‌రాజ‌యం తర్వాత మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆదివారం రాష్ట్ర అధ్యక్ష, జిల్లా అధ్యక్ష పదవులు మినహా పార్టీ మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేసింది. పార్టీ ఘోర పరాజయాన్ని సమీక్షించేందుకు జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించింది అధిస్టానం. మీరట్ నుండి ముంకద్ అలీ, బులంద్‌షహర్ నుండి రాజ్‌కుమార్ గౌతమ్, అజంగఢ్ నుండి విజయ్ కుమార్ ల‌ను ముగ్గురు చీఫ్ కోఆర్డినేటర్లుగా పార్టీ నియమించింది.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై చర్చించేందుకు ఈ సమావేశానికి పిలుపునిచ్చాం. 2017లో జరిగిన ఎన్నికల్లో కూడా మాకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ..సమాజ్‌వాదీ పార్టీ కంటే 1.9 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయని బీఎస్పీ నేత ఉమాశంకర్ సింగ్ చెప్పారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ పూర్తి మెజారిటీ సాధించింది. అయితే.. అప్పటి నుంచి పార్టీ పనితీరు దయనీయంగా మారింది ఈసారి.. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాగా.. బహుజన్ సమాజ్ పార్టీ 12.88 శాతం ఓట్లతో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది.

మార్చి 11న, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి ఒక "పాఠం" అని మాయావతి అన్నారు. అయితే.. తిరిగి వస్తానని హామీ ఇస్తూ.. నిరుత్సాహపడవద్దని బీఎస్పీ అధినేత్రి పార్టీ కార్యకర్తలను కోరారు. ఓట‌మి నుంచి మనం పాఠాలు నేర్చుకుని.. ఆత్మపరిశీలన చేసుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లి మళ్లీ అధికారంలోకి రావాలని మాయావతి అన్నారు. 2017కి ముందు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప‌రిస్థితి అంత మంచిగా ఏం లేదు. నేడు కాంగ్రెస్‌ కూడా 2107లో బీజేపీ ఎలా ఉందో ద‌రిదాపు సమానమైన దశలోనే ఉంది.. యూపీ ఎన్నికల ఫలితాలు మనకు గుణపాఠమ‌ని మాయావతి అన్నారు.













Next Story