విద్యార్థిని బిల్డింగ్‌ పై అంతస్తు నుంచి వేలాడదీసిన ప్రధానోపాధ్యాయుడు.!

Boy dangled by foot leads to up principals arrest. ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపుర్‌లో ఓ విద్యార్థి పట్ల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అల్లరి చేస్తున్నాడన్న

By అంజి  Published on  29 Oct 2021 7:46 PM IST
విద్యార్థిని బిల్డింగ్‌ పై అంతస్తు నుంచి వేలాడదీసిన ప్రధానోపాధ్యాయుడు.!

ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపుర్‌లో ఓ విద్యార్థి పట్ల ప్రధానోపాధ్యాయుడు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. అల్లరి చేస్తున్నాడన్న కారణంతో ఓ విద్యార్థిని బిల్డింగ్‌ పై నుంచి వేలాడదీశాడు ప్రధానోపాధ్యాయుడు. దీనికి సంబంధించి ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అహ్రౌరాలోని సద్భావన శిక్షణ స్కూల్‌లో విద్యార్థులు మధ్యాహ్నం ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ రెండో తరగతి విద్యార్థిత తోటి విద్యార్థితో గొడవ పడ్డాడు. ఈ విషయం కాస్తా ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లింది.

ఆగ్రహంతో ఆ విద్యార్థిని స్కూల్‌ పై అంతస్తు నుండి వేలాడదీశాడు. దీంతో ఆ విద్యార్థి ప్రాణభయంతో గట్టిగా కేకలు వేశాడు. అక్కడే ఉన్న ఇతర విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు అల్లరి చేస్తే సర్దిచెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఇలా చేయడంపై గ్రామస్తులకు కోపం తెప్పించింది. తప్పు చేస్తే.. ఇలాంటి శిక్ష విధించడం సరికాదని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధానోపాధ్యాయుడు విశ్వకర్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని పలు సెక్షన్ల కింద అరెస్ట్‌ చేయబడిన ప్రధానోపాధ్యాయుడు మనోజ్‌ విశ్వకర్మ.. ఓ దినపత్రికతో మాట్లాడుతూ.. విద్యార్థిని సరైన మార్గంలో పెట్టాలని తన తండ్రి మాకు చెప్పాడని అన్నారు. విద్యార్థి సోను చాలా అల్లరి చేసేవాడు.. పిల్లలను కొరుకుతాడు, టీచర్లను కూడా తిడతాడు. అందుకే అతన్ని భయపెట్టేందుకు ప్రయత్నించానని అన్నాడు.


Next Story