సంచ‌ల‌నం : రాజకీయాలకు 'గుడ్‌బై' చెప్పిన బీజేపీ ఫైర్‌బ్రాండ్

BJP's Babul Supriyo announces exit from politics. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్

By Medi Samrat
Published on : 31 July 2021 7:27 PM IST

సంచ‌ల‌నం : రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన బీజేపీ ఫైర్‌బ్రాండ్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి సంచ‌ల‌నానికి తెర‌లేపారు. బాబుల్ సుప్రియో ప్రస్తుతం అసన్‌సోల్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. తన రాజీనామా విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఇటీవ‌ల ప్రధాని మోదీ మంత్రివర్గ విస్తరణకు ముందు సీనియర్లతో పాటు మరికొంత మంది మంత్రులకు కూడా ఉద్వాసన పలికారు. ఆ జాబితాలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న‌ బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు. సుప్రియోను మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచి బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సంచ‌ల‌నానికి తెర‌లేపారు.

సుప్రియో ఫేస్‌బుక్ పోస్టులో 'గుడ్ బై.. ఏ ఇతర పార్టీల్లోనూ చేరడం లేదు. చేరమని నన్నెవరూ సంప్రదించలేదు. ఎందులోనూ చేరడం లేదు. నేనెప్పుడూ ఒకే పార్టీకి చెందినవాణ్ణి. సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. అయితే సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. రాజకీయేతర రంగంలో ఉంటు కూడా సేవ చేయవచ్చ'ని రాసుకొచ్చారు.


Next Story