ప్రధానిని దూషించాడని.. యువకుడిని బింగీలు తీయించి.. దారుణంగా కొట్టారు

BJP workers thrash youth, force him to lick spit and chant ‘Jai Shri Ram’ in Jharkhand. జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో ఓ యువకుడిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అతడిని కొట్టిన తర్వాత, రోడ్డుపై ఉమ్మి నాకించారు.

By అంజి  Published on  8 Jan 2022 6:00 AM GMT
ప్రధానిని దూషించాడని.. యువకుడిని బింగీలు తీయించి.. దారుణంగా కొట్టారు

జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో ఓ యువకుడిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అతడిని కొట్టిన తర్వాత, రోడ్డుపై ఉమ్మి నాకించారు. ఆ తర్వాత బలవంతంగా 'జై శ్రీ రామ్' అని నినాదాలు చేయించారని సమాచారం. ఇదంతా బీజేపీ ఎంపీ పీఎన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సిన్హా తదితర నేతల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ వారం ప్రారంభంలో పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతలో లోపంపై ధన్‌బాద్‌లోని గాంధీ చౌక్‌లో బిజెపి కార్యకర్తలు శుక్రవారం నిరసన తెలిపారు. వారి నిరసన సమయంలో, ఒక బాటసారుడు జార్ఖండ్ బిజెపి చీఫ్ దీపక్ ప్రకాష్, ప్రధాని నరేంద్ర మోడీపై అన్‌పార్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగించినట్లు బిజెపి సీనియర్ నాయకులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు మూగప్రేక్షకులుగా ఉండగా బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని కొట్టారు. ఆ తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.



బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్‌లో హామీ ఇచ్చారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సామాజిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఎవరినీ అనుమతించబోమని, మత సామరస్యాన్ని సృష్టించే వారిని వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైరల్ వీడియో ఆధారంగా ఇద్దరు బీజేపీ కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ స్వర్గియరీ తెలిపారు.

కాంగ్రెస్ మరియు జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ సంఘటనను ఖండించాయి. మాబ్ లింఛింగ్ సంఘటనలను నిరోధించడానికి రాష్ట్రం ఇప్పటికే బిల్లును ఆమోదించిందని, అయితే అలాంటి కేసులు ఇంకా పుట్టుకొస్తున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా, ఈ విషయాన్ని పార్టీ పరిశీలిస్తుందని, దాడి చేసినవారు వాస్తవానికి బిజెపి కార్యకర్తలా కాదా అని దర్యాప్తు చేస్తామని బిజెపి నాయకుడు సిపి సింగ్ చెప్పారు. పార్టీ కార్యకర్తలు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితుడిని కొట్టాలని పార్టీ సీనియర్ నేతలెవరూ కార్యకర్తలను కోరలేదని కూడా బిజెపి నాయకుడు చెప్పారు.

Next Story