మోదీకి గుడి కట్టిన అభిమాని..!

BJP Worker Builds Temple for Modi. రాజకీయ నాయకులకు కల్ట్ ఫాలోవర్లు ఉంటారు. వారు తమ అభిమాన నాయకుడి కోసం ఏది

By Medi Samrat  Published on  18 Aug 2021 1:39 PM GMT
మోదీకి గుడి కట్టిన అభిమాని..!

రాజకీయ నాయకులకు కల్ట్ ఫాలోవర్లు ఉంటారు. వారు తమ అభిమాన నాయకుడి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్లలో నరేంద్ర మోదీ ఒకరు. ఇక భారత్ లో చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా మోదీకి ఓ అభిమాని ఏకంగా గుడినే కట్టేశారు. అది ఎక్కడో తెలుసా..? మహారాష్ట్రలోని పూణేలో..! పాలరాతితో చేయించిన విగ్రహాన్ని ప్రతిష్టించారు.

మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో మోదీకి చిన్న గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. జైపూర్‌ నుంచి ఎర్రని పాల రాయిని తెప్పించి నిర్మాణానికి వినియోగించారు. తెల్ల పాలరాయితో చేసిన మోదీ విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేశారు. భద్రతగా ముందు వైపు గట్టి అద్దాన్ని ఫిక్స్‌ చేశారు. ఆ గుడి ముందు మోదీకి అంకితమిస్తూ ఒక పద్యంతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో మోదీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం దీనిని ప్రారంభించారు. ప్రధాని అయిన తర్వాత మోడీ చాలా అభివృద్ధి పనులు చేశారని, జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి వాటి పట్ల విజయవంతంగా వ్యవహరించారని ముండే అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వ్యక్తికి కూడా ఒక మందిరం ఉండాలని తాను భావించానని, అందుకే మోదీకి గుడిని తన సొంత ప్రాంగణంలో నిర్మించినట్లు వెల్లడించారు. మయూర్ ముండే ఒక రియలెస్టేట్ వ్యాపారి.


Next Story
Share it