జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు బీజేపీ నేతను కాల్చిచంపారు. వివరాళ్లోకివెళితే.. పుల్వామాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ రాకేష్ పండిట్.. ట్రాల్ ప్రాంతంలోని అతని స్నేహితుడి ఇంటికి వెళ్తుంటే ముగ్గురు ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు. బీజేపీ కౌన్సిలర్ రాకేష్ కు వ్యక్తిగత భద్రత కల్పించినా, అతను ట్రాల్ కు సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వెళ్లారని పోలీసులు చెప్పారు.
ఉగ్రవాదుల దాడి ఘటనను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. ఈ కాల్పుల్లో అసీఫా ముస్తాఖ్ అనే ఓ మహిళ కూడా గాయపడ్డారు. గాయపడిన అసీఫాను శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసు, భద్రతాబలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి.