భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 3న జరగనున్న 8 రాష్ట్రాల నుండి రాజ్యసభ ఉప ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజస్థాన్ నుంచి కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్‌లను బీజేపీ పోటీకి దింపింది.
బీజేపీ బీహార్ నుండి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా, ఒడిశా నుండి మాజీ BJD నాయకురాలు మమతా, త్రిపుర నుండి రాజీబ్ భట్టాచార్జీ, అస్సాం నుంచి రామేశ్వర్ తైలీతో పాటు మిషన్ రంజన్ దాస్, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్, మహారాష్ట్ర నుంచి ధైర్షీల్ పాటిల్, రాజస్థాన్ నుంచి రవనీత్ సింగ్ బిట్టులను రాజ్యసభకు నామినేట్ చేసింది. 8 రాష్ట్రాల్లోని 9 స్థానాలకు గాను బీజేపీ ఈ జాబితాను విడుదల చేసింది.