కిషన్ రెడ్డికి మ‌రో కీల‌క బాధ్య‌త‌ అప్ప‌జెప్పిన బీజేపీ అధిష్టానం

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.

By Medi Samrat  Published on  17 Jun 2024 11:00 AM GMT
కిషన్ రెడ్డికి మ‌రో కీల‌క బాధ్య‌త‌ అప్ప‌జెప్పిన బీజేపీ అధిష్టానం

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిషన్ రెడ్డి సోమవారం జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌లు, కో-ఇంఛార్జులను నియమించారు. ఈ క్ర‌మంలోనే కిషన్ రెడ్డికి ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్న‌ట్లు పార్టీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న వెల్ల‌డించింది.

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. జమ్మూ కాశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌ను మహారాష్ట్ర ఇంచార్జ్‌గా నియమించగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కో-ఇంఛార్జిగా వ్యవహరిస్తారని పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను హర్యానా ఎన్నికల ఇంచార్జ్‌గా.. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ను కో-ఇంఛార్జిగా నియమించారు.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను జార్ఖండ్‌ ఎన్నికల ఇంచార్జిగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కో-ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రకటన తెలిపింది.


Next Story