స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు.. చట్టంపై సుప్రీం కీల‌క ఆదేశాలు

Big Supreme Court Win For Haryana, 75% Locals' Jobs Quota Remains For Now. స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే హర్యానా చట్టంపై

By Medi Samrat  Published on  17 Feb 2022 11:13 AM GMT
స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు.. చట్టంపై సుప్రీం కీల‌క ఆదేశాలు

స్థానిక అభ్యర్థులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించే హర్యానా చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు బుధవారం ఎత్తివేసింది. వివాదాస్పద కొత్త చట్టాన్ని అనుసరించకూడదని నిర్ణయించుకున్న ప్రైవేట్ రంగ యజమానులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హర్యానా ప్రభుత్వానికి చెప్పారు. హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం అమలును నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ ఆదేశాలు జారీ చేయడానికి కారణాలను హైకోర్టు తెలియజేయకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం అమలును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇటీవల నిలిపేసింది. ఈ తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడానికి కారణాలను హైకోర్టు వివరించలేదు. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రతిభకు, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రైవేటు యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ చట్టం కేవలం భౌగోళిక వర్గీకరణను మాత్రమే ప్రస్తావిస్తోందని, దీనికి రాజ్యాంగం అనుమతిస్తోందని చెప్పింది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కు, ఆరోగ్య, హక్కు, జీవన ప్రమాణాలు, ఉపాధి పొందే హక్కులను కాపాడటానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. హర్యానా రాష్ట్ర స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం, 2020 ప్రకారం నెలకు రూ.30,000 కన్నా తక్కువ వేతనం చెల్లించే ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని ఉంది. ఇందుకు ప్రైవేట్ సంస్థలు ఒప్పుకోలేదు.


Next Story