బీహార్‌లోని గయా జిల్లాలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ రాకెట్‌లో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వాట్స్‌గ్రూప్, సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల చిత్రాలను పంపడం ద్వారా ఒప్పందాన్ని నిర్ణయించుకునేవారు. ఆ తర్వాత అమ్మాయిలను పిలిపించి.. గయాతో పాటు పాట్నా మరియు సమీప జిల్లాలలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి 16 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దాదాపు 1500 మంది కస్టమర్ల నంబర్లను సేవ్ చేసి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో గయాకు చెందిన అనేక హై ప్రొఫైల్ వ్యక్తుల పేర్లు ఏమైనా ఉన్నాయో అనే కోణంలో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.
మహిమ హోటల్ పక్కనే పేరు లేకుండా ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిత్యం వస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ఘటనా స్థలంలో బాలికలు సహా దాదాపు పదిహేను మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఎస్‌పీ ఆదిత్య కుమార్ ఈ కేసుకు సంబంధించి సమాచారం అందించగా.. పలువురు బాలికలు ఈ సెక్స్ రాకెట్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. బాలికలందరూ కోల్‌కతాలోని ఇతర ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.