భోపాల్ గ్యాస్ లీక్ కేసు.. కేంద్రం పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

Supreme Court dismisses Centre’s petition seeking additional compensation. భోపాల్ గ్యాస్ లీక్ (1984) ప్రమాదంలో మరణించినవాళ్లకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అదనపు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ

By M.S.R
Published on : 14 March 2023 4:30 PM IST

భోపాల్ గ్యాస్ లీక్ కేసు.. కేంద్రం పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

Bhopal Gas Tragedy

భోపాల్ గ్యాస్ లీక్ (1984) ప్రమాదంలో మరణించినవాళ్లకు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అదనపు నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టిపడేసింది. నాలుగు దశాబ్దాల నాటి అంశాన్ని మళ్లీ ఇప్పుడు బయటికి లాగి దానిపై కేసులు నమోదు చేయడంపై ఉన్న హేతుబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇందు కోసం యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సంస్థ 470 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఆ సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థలు కూడా అదనంగా రూ.7400 కోట్లు చెల్లించాలని పిటిషన్ లో పేర్కొంది. గతంలో జరిగిన సెటిల్‌మెంట్ టైంలో ప్రమాద తీవ్రతను సరిగా అంచనా వేయలేదని వాదించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సమస్యను తెరపైకి తీసుకురావడంపై కేంద్రం సరైన కారణం చూపలేదు. అంతేకాకుండా బాధితులకు పరిహారాన్ని పంపిణీ చేయకుండా ఇంకా రూ. 50 కోట్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిరుపయోగంగా ఉన్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్‌, సంజీవ్ ఖ‌న్నా, అభ‌య్ ఓకా, విక్ర‌మ్‌నాథ్‌, జేకే మ‌హేశ్వ‌రిల‌తో కూడిన ధ‌ర్మాసం ఈ తీర్పును ఇచ్చింది. యునియ‌న్ కార్బైడ్ సంస్థ‌పై అద‌న‌పు భారాన్ని విధించ‌డం స‌రికాదని, ఆ కేసును రీఓపెన్ చేయ‌డం వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌ల్ని సృష్టించ‌డ‌మే అవుతుంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.


Next Story