కాంగ్రెస్ పట్ల జాగ్రత్త: ప్రధాని మోదీ

కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు.

By -  అంజి
Published on : 18 Jan 2026 12:49 PM IST

Congress,  infiltrators, PM Modi, Assam, National news

కాంగ్రెస్ పట్ల జాగ్రత్త: ప్రధాని మోదీ

కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా చొరబాటుదారులను కాపాడుతోందని ఆరోపించారు. ఓటర్లు ఆ పార్టీ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అక్రమ చొరబాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారులకు భూమి ఇచ్చిందని, వారు పేదలు, దిగువ మధ్యతరగతి, రైతుల ఉద్యోగాలను లాక్కున్నారని ప్రధాని ఆరోపించారు.

"చొరబాటుదారులు అస్సాం జనాభాను మారుస్తున్నారు, నేరాలు పెరిగాయి. వారు మన సంస్కృతిపై దాడి చేస్తున్నారు. గిరిజన భూములను ఆక్రమించుకుంటున్నారు. ఇది అస్సాంకు, దేశానికి ప్రమాదం" అని ఆయన కాలియాబోర్‌లో జరిగిన ర్యాలీలో అన్నారు. ఈ ముప్పు ప్రమాదకరమని పేర్కొంటూ, బలమైన బిజెపి ప్రభుత్వం అక్రమ వలసలను ఆపగలదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. విశ్వాసాన్ని కోల్పోయింది" అని అన్నారు.

“2025లో కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో వేట కారణంగా ఒక్క ఖడ్గమృగం కూడా చనిపోకుండా బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది, ఇది మా కఠినమైన పరిరక్షణ చర్యల విజయాన్ని ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.6,950 కోట్లతో నిర్మించనున్న కాజీరంగ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి, అస్సాంలోని నాగావ్ జిల్లాలోని కలియాబోర్‌లో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో ఆయన రెండు రాష్ట్రాల పర్యటనలో ఇది రెండవ రోజు. తరువాత ఆయన రూ.830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి, శంకుస్థాపన చేయడానికి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తారు. శనివారం, ప్రధాని మోదీ రూ.3,250 కోట్ల విలువైన రైలు, రోడ్డు ప్రాజెక్టులను ఆవిష్కరించారు. హౌరా - గౌహతి మధ్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు, గౌహతిలో రోడ్‌షో నిర్వహించారు. 10,000 మందికి పైగా బోడో కళాకారుల సామూహిక బగురుంబా నృత్య ప్రదర్శనను వీక్షించారు.

Next Story