అప్రమత్తంగా ఉండండి : ప్రధాని మోదీ
Be vigilant as Covid cases rising in many countries. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ సంవత్సరం చివరి 'మన్ కీ బాత్' ప్రసారంలో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 25 Dec 2022 5:52 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ సంవత్సరం చివరి 'మన్ కీ బాత్' ప్రసారంలో పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కోవిడ్ -19 పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ చాలా దేశాలలో వ్యాపిస్తోందని.. కేసులు పెరుగుతున్నాయని, సురక్షితంగా ఉండటానికి మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా ఆయన గురించి ప్రస్తావించారు. ప్రతి రంగంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని అన్నారు. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ప్రధాని ప్రసంగించారు. దేశం వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది ప్రజలు వేడుకలు జరుపుకుంటారు. వైరస్ మీ ఆనందాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా ఉండేందుకు.. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి మార్గదర్శకాలను అనుసరించాలని ప్రజలను కోరారు. "ప్రపంచంలోని అనేక దేశాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని మనం చూస్తున్నాము. మనం జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు ధరించాలి. చేతులు కడుక్కోవాలి" అని ప్రధాన మంత్రి అన్నారు.
ఆరోగ్య రంగంలో భారతదేశం అధిగమించిన సవాళ్ల గురించి ప్రస్తావిస్తూ.. "గత కొన్ని సంవత్సరాలుగా మనం ఆరోగ్య రంగంలో అనేక సవాళ్లను అధిగమించాము. భారతదేశంలో మశూచి, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించాము. ప్రస్తుతం కాలా అజార్ వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాధి ఇప్పుడు బీహార్ & జార్ఖండ్‌లోని 4 జిల్లాల్లో మాత్రమే ఉంది. సమిష్టి కృషితో భారతదేశం త్వరలో కాలా అజార్‌ను నిర్మూలిస్తుందని మోదీ అన్నారు.