ఉగ్రవాది అరెస్ట్‌.. మహాకుంభ్‌లో అలజడి సృష్టించేందుకు వచ్చాడ‌ట‌..!

బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ), ఐఎస్ఐ మాడ్యూల్‌కు చెందిన చురుకైన ఉగ్రవాది లాజరస్ మాసిహ్‌ను గురువారం ఉదయం యూపీ ఎస్‌టిఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  6 March 2025 4:14 PM IST
ఉగ్రవాది అరెస్ట్‌.. మహాకుంభ్‌లో అలజడి సృష్టించేందుకు వచ్చాడ‌ట‌..!

బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ), ఐఎస్ఐ మాడ్యూల్‌కు చెందిన చురుకైన ఉగ్రవాది లాజరస్ మాసిహ్‌ను గురువారం ఉదయం యూపీ ఎస్‌టిఎఫ్, పంజాబ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడు మహకుంభ్‌లో అల‌జ‌డి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి నేరాలను సహించేది లేదని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ అన్నారు. యూపీ పోలీసు, పంజాబ్ పోలీసుల STF సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది. మార్చి 6న బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI), ISI మాడ్యూల్‌కు చెందిన చురుకైన ఉగ్రవాది లాజరస్ మాసిహ్‌ను అరెస్టు చేశామ‌ని పేర్కొన్నారు.

అరెస్టయిన నిందితుడి మొబైల్ లేదా స్వాధీనంలో ఉన్న వ‌స్తువుల‌లో మాకు ఏదైనా సమాచారం ఉన్నట్లు కనుగొంటే, మేము వాటిని ఖచ్చితంగా మీతో పంచుకుంటామ‌ని మీడియాతో అన్నారు. ఇప్పటి వరకు మాకు లభించిన సమాచారం ప్రకారం.. నిందితుడు మహాకుంభ్‌లో అలజడి సృష్టించేందుకు వచ్చారని చెప్పవచ్చ‌ని పేర్కొన్నారు.

Next Story