తీసుకున్న రుణాల‌కు.. రెట్టింపు ఆస్తులను ఈడీ జ‌ప్తు చేసింది

Attaching Rs 14,000 Cr Against Rs 6,200 Cr Debt. బ్యాంకులకు వేల కోట్ల ఎగ‌నామం పెట్టి విదేశాల‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను

By Medi Samrat  Published on  27 July 2021 12:06 PM IST
తీసుకున్న రుణాల‌కు.. రెట్టింపు ఆస్తులను ఈడీ జ‌ప్తు చేసింది

బ్యాంకులకు వేల కోట్ల ఎగ‌నామం పెట్టి విదేశాల‌కు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను 'దివాలా దారు'గా ప్రకటిస్తూ లండన్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనిపై ట్విటర్‌ వేదికగా మాల్యా స్పందిస్తూ.. భారతీయ బ్యాంకులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై సంచ‌ల‌న‌ ఆరోప‌ణ‌లు చేశారు. బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల‌కు.. రెట్టింపు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని అన్నారు. అయితే.. బ్యాంకులు, ఈడీకి సొమ్ము తిరిగి ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే.. తనను దివాలాదారుగా ప్రకటించమని న్యాయస్థానాన్ని కోరాయని విజయ్‌ మాల్యా ఆరోపించారు.

బ్యాంకుల నుంచి నేను తీసుకున్న రుణాల మొత్తం రూ.6.2వేల కోట్లు అయితే.. ఇందుకు ఈడీ రూ.14వేల కోట్ల విలువైన నా ఆస్తులను జప్తు చేసుకుని బ్యాంకులకు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక ఆ ఆస్తుల‌లో కొన్నింటిని విక్రయించిన బ్యాంకులు రూ. 9వేల కోట్ల వరకు నగదు రూపంలో రికవరీ చేసుకున్నాయి. మిగతా రూ.5వేల కోట్లను సెక్యూరిటీగా పెట్టుకున్నాయని విజ‌య్ మాల్యా ఆరోపణ‌లు చేశారు. అయితే సెక్యూరిటీగా పెట్టుకున్న ఆ డబ్బును ఈడీకి తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే బ్యాంకులు కోర్టుకు వెళ్లి నన్ను దివాలాదారుగా ప్రకటించేలా చేశాయ‌ని మాల్యా ట్విటర్ లో రాసుకొచ్చారు.

ఇదిలావుంటే.. లండన్‌ హైకోర్టు విజ‌య్‌ మాల్యా దివాలా తీసినట్లు ప్ర‌క‌టించింది. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా.. వాటిని త‌మ‌ ఆధీనంలోకి తీసుకుని బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు లైన్ క్లియ‌రైంది.


Next Story