ఆప్ 'ఆపరేషన్ లోటస్‌'కు పాల్ప‌డుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

బీజేపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆప్ నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

By Medi Samrat
Published on : 7 Feb 2025 9:29 AM

ఆప్ ఆపరేషన్ లోటస్‌కు పాల్ప‌డుతుంది.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

బీజేపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆప్ నేతలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లేదా మరేదైనా ఏజెన్సీతో విచారణ జరిపించాలని, ఈ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ ఫిర్యాదుపై లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఏడుగురు ఆప్‌ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 15 కోట్ల ఇస్తామ‌ని బీజేపీ ఆకర్షిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని అందుకే ఆపరేషన్‌ కమలం ప్రారంభించిందని ఆరోపించారు.

సంజయ్ సింగ్ ఆరోపణపై ఢిల్లీ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అతిషి కూడా తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. బీజేపీ ఫిర్యాదుపై హైకోర్టులో కేసు నడుస్తోంది. సంజయ్ సింగ్ క్షమాపణ చెప్పకపోతే, అతనిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు.

ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉంద‌ని వ్యక్తమవడంతో, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి అతిషి ఎక్స్‌లో ఫేక్ అని పేర్కొన్నారు. ఫేక్ ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి 55 సీట్లు వస్తుంటే, 16 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.15 కోట్ల చొప్పున ఇస్తామ‌ని ఎర వేసి ఎందుకు చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

కేజ్రీవాల్ ఉదయం ఆప్ అభ్యర్థుల సమావేశానికి పిలుపునిచ్చారు. ఆప్ నేతలు మరోసారి బీజేపీ ఆరోపణలను పునరుద్ఘాటించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం తీవ్రమైన విషయమన్నారు.

ఇదిలావుంటే.. బీజేపీ ఫిర్యాదును వెంటనే పరిగణలోకి తీసుకున్న లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విషయాన్ని సీరియస్‌గా, సమయానుకూలంగా విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.

Next Story