బీజేపీ గెలిస్తే.. ఆప్ రాజకీయాల నుండి వైదొలుగుతుంది

Arvind Kejriwal Goes All In Against BJP. మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయడంపై భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు

By Medi Samrat
Published on : 23 March 2022 3:47 PM IST

బీజేపీ గెలిస్తే.. ఆప్ రాజకీయాల నుండి వైదొలుగుతుంది

మునిసిపల్ ఎన్నికలను వాయిదా వేయడంపై భారతీయ జనతా పార్టీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఈ ఎన్నికలను సకాలంలో నిర్వహించి.. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలను వదిలివేస్తుందని అన్నారు. ఢిల్లీలో ఉత్తర, తూర్పు, దక్షిణాది.. లా మూడు పౌర సంఘాలను ఏకం చేసే బిల్లుకు మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ వెలుపల విలేకరులతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, "బీజేపీ ఎంసీడీ ఎన్నికలను నిర్వహించి, వాటిలో గెలిస్తే మేము (ఆప్) రాజకీయాలను వదిలివేస్తాము. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అని చెబుతుంది, కానీ అది చిన్న పార్టీ, చిన్న ఎన్నికలకు భయపడింది. నేను సకాలంలో MCD ఎన్నికల నిర్వహణ కోసం బీజేపీకి సవాల్ విసురుతున్నా" అని అన్నారు. అనంతరం కేజ్రీవాల్ ట్విటర్‌లో.. ఎన్నికలను వాయిదా వేయడం అమరవీరులను అవమానించడమేనని తెలిపారు.

"ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ వాయిదా వేయడం బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి త్యాగాలు చేసిన అమరవీరులను అవమానించడమే, ఈ రోజు ఓటమి భయంతో వారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు. రేపు రాష్ట్రాలు, దేశ ఎన్నికలను వాయిదా వేస్తారు' అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.










Next Story