చైనా దేశంతో సరిహద్దు పంచుకుంటున్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని కామెంగ్ నదిలో నీళ్లు ఒక్కసారిగా నల్లగా మారాయి. దీంతో వేలాది చేపలు మరణించాయి. అయితే దీనికి కారణం చైనానే అని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఈస్ట్ కామెంగ్ జిల్లా అధికారులు మాట్లాడుతూ.. టోటల్ డిజాల్వ్‌డ్ సబ్‌స్టాన్సెస్ కలవడం వల్లే నదిలోని నీరు నల్లగా మారిందని చెప్పారు. స్థానిక మత్స్య అభివృద్ధి శాఖ అధికారి హలి టజో మాట్లాడుతూ.. నదిలో నీరు హఠాత్తుగా నల్లగా మారిందని, కామెంగ్ నదిలో వేలాది చేపలు మరణించాయని చెప్పారు. టీడీఎస్ పెద్ద మొత్తంలో కలవడేమనని దీనికి కారణమన్నారు. టోటల్ డిజాల్వ్‌డ్ సబ్‌స్టాన్సెస్ నీటిలో కలవడం వల్ల.. చేపలు, నీటిలోని ఇతర జీవలు సరిగ్గా శ్వాస తీసుకోలేవు. లీటర్ నీటిలో 300 నుంచి 1200 మిల్లీ గ్రాముల వరకు టీడీఎస్ ఉండటం ప్రమాదకరమని చెప్పారు.
కామెంగ్ నదిలో ఇది 6,800 మిల్లీ గ్రాములు ఉన్నట్లు చెప్పారు. మరణించిన చేపలను తెచ్చుకొని తినవద్దని, ఇవి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. దీనికి సంబంధించి ఈస్ట్ కామెంగ్ జిల్లా అధికారులు మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆదేశాలు వచ్చే వరకు నదిలో చేపల వేటకు వెళ్లొదన్నారు. అలాగే శుక్ర, శని వారల్లో మరణించిన చేపలను తినవద్దన్నారు. సెప్పా పట్టణ వాసులు మట్లాడుతూ.. ఇది చైనా పనేనని అన్నారు. చైనా చేస్తున్న నిర్మాణాల వల్లే నదిలోని నీరు నల్లగా మారిందన్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే టపుక్ టకు మాట్లాడారు. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.