డ్రోన్ల ద్వారా ఏమైనా విడిచారా.?

జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో డ్రోన్లను గుర్తించిన భారత సైన్యం వాటిపై కాల్పులు జరిపింది.

By -  Medi Samrat
Published on : 14 Jan 2026 11:59 AM IST

డ్రోన్ల ద్వారా ఏమైనా విడిచారా.?

జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో డ్రోన్లను గుర్తించిన భారత సైన్యం వాటిపై కాల్పులు జరిపింది. బార్డర్ దాటి వచ్చిన పాక్ డ్రోన్లపై కాల్పులు జరపగా, ఆ తర్వాత అవి మాయమయ్యాయని భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 48 గంటల్లోనే పాక్ డ్రోన్లు మన సరిహద్దుల్లోకి రావడం ఇది రెండోసారి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన ఈ డ్రోన్లపై కాల్పులు జరపగా.. వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. ఈ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల రవాణా కానీ అక్రమ ఆయుధాల వ్యాపారం కానీ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ల ద్వారా ఏవైనా ప్యాకెట్లు జారవిడిచి ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

Next Story