చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మనోజ్‌ పాండే

Army chief vows not to allow loss of land. ఆర్మీ కొత్త చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనాతో సరిహద్దు వెంబడి

By Medi Samrat  Published on  2 May 2022 11:19 AM IST
చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన మనోజ్‌ పాండే

ఆర్మీ కొత్త చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా చైనాకు వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే స్పష్టం చేశారు. చైనా ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్‌ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సిద్ధం చేయడానికే ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఆదివారం సౌత్‌బ్లాక్‌లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌తో కలిసి జనరల్‌ పాండే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ 61వ బ్యాచ్‌లో కలిసి చదువుకున్నవాళ్లే. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌లు తన క్లాస్‌మేట్లేనని జనరల్‌ పాండే అన్నారు.








Next Story