భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. షక్సాగామ్ వ్యాలీలో చైనా మౌళిక సదుపాయాల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. 1963లో చైనా-పాక్ మధ్య జరిగిన భూబదిలీ ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ ఆమోదించేది లేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. షక్సాగామ్ వ్యాలిలో చైనా చేపడుతున్న నిర్మాణాలపై జనవరి 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ భూమిపై పాక్- చైనా చేసుకున్న ఒప్పందం ఎప్పటికీ చెల్లదు. దీనిని భారత్ ఎప్పటికీ గుర్తించదని ప్రకటించింది. అయితే దానికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో వింగ్ నిన్న స్పందించారు. 1963లోనే ఈ భూభాగంపై పాకిస్థాన్-చైనా అంగీకారం చేసుకున్నాయని ఇప్పుడు దానిపై స్పందించడానికి భారత్‌కు అవకాశం లేదన్నారు.