అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.

By -  Medi Samrat
Published on : 16 Oct 2025 3:24 PM IST

అందుకే గూగుల్ కర్ణాటకను కాదనుకుంది..!

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం గూగుల్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోందని, అందుకే ఆ సంస్థ ఏపీ వైపు చూస్తోందని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆ సంస్థకు ఏకంగా రూ.22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఇచ్చిందని తెలిపారు. కేవలం నగదు ప్రోత్సాహకాలే కాకుండా అనేక రాయితీలను కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్, కంపెనీకి కేటాయించిన భూమిపై 25 శాతం డిస్కౌంట్, నీటి టారిఫ్‌లో కూడా 25 శాతం రాయితీ కల్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వీటికి అదనంగా, విద్యుత్ ట్రాన్స్‌మిషన్‌ను 100 శాతం ఉచితంగా అందిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఈ విషయాలన్నీ బయటకు రావని, కేవలం గూగుల్ వచ్చిందని మాత్రమే పత్రికల్లో వార్తలు రాస్తారని ఆయన అన్నారు. తాము కర్ణాటకలో ఇన్ని రాయితీలు ఇస్తే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శిస్తారన్నారు.

Next Story