ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని నీరాలబాద్‌కు పీపల్ మండి ప్రాంతానికి చెందిన 88 ఏళ్ల గణేష్ శంకర్ పాండే తన రూ.2 కోట్లు విలువ చేసే ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాశాడు. తనకు దక్కిన వాటాను 2018 ఆగస్టు 4న నాడే ఆగ్రా కలెక్టర్ పేరు మీద రాసిన.. తాజాగా ఆ పత్రాలను కలెక్టర్‌కు అప్పగించేందుకు వచ్చాడు. గణేష్ శంకర్ పాండే తన సోదరులు నరేష్ రఘునాథ్, అజయ్‌లతో కలిసి 1983లో 1,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ స్థలంలో అతను చాలా విలాసవంతమైన ఇంటిని నిర్మించాడు. ఈ ఇంటి ధర ఇప్పుడు రూ.13 కోట్లుగా చెబుతున్నారు. నలుగురు అన్నదమ్ములు ఇంటిని విభజించారు. ప్రస్తుతం గణేష్ యజమానిగా ఉన్న ఇంటి భాగం విలువ దాదాపు రూ.3 కోట్లు (మూడు కోట్ల రూపాయల ఆస్తి).
కుటుంబ సభ్యులు తనను ఇంటి నుంచి బయటకు వెలివేశారని గణేష్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం తన సోదరులు రఘునాథ్, అజయ్‌ల వద్ద ఉంటున్నానని, తన ఇద్దరు కొడుకులు తనను పట్టించుకోకుండా వదిలేశారని గణేష్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఆస్తిని కలెక్టర్ పేరు మీద రాయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గణేష్ శంకర్ తన ఇంటిని ఆగస్ట్ 2018లో ఆగ్రా డీఎం పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని.. ఇప్పుడు కలెక్టరేట్‌కు వెళ్లి ఈ రిజిస్ట్రీని సిటీ మేజిస్ట్రేట్ ప్రతిపాల్ చౌహాన్‌కు అందజేశాడని చెబుతున్నారు. ఈ కేసులో మేజిస్ట్రేట్ తనకు వచ్చిన వీలునామా ఆగ్రా డీఎం పేరిట ఉందని చెప్పారు. ఆస్తి విలువ దాదాపు రూ.2 కోట్లు. ఈ వీలునామాపై అన్నయ్యలకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అతని వద్ద వీలునామా కాపీ కూడా ఉంది.