ఆ విమానం రెస్టారెంట్‌లోకి వెళ్తే.. గాల్లో తేలినట్లే ఉంటుంది.!

Airplane restaurant in gujarat. అది ఓ రెస్టారెంట్‌.. అందులో అడుగు పెడితే మాత్రం అచ్చం నిజమైన విమానం ఎక్కినట్లే అనిపిస్తుంది. సందర్శకులను

By అంజి  Published on  26 Oct 2021 3:21 PM IST
ఆ విమానం రెస్టారెంట్‌లోకి వెళ్తే.. గాల్లో తేలినట్లే ఉంటుంది.!

అది ఓ రెస్టారెంట్‌.. అందులో అడుగు పెడితే మాత్రం అచ్చం నిజమైన విమానం ఎక్కినట్లే అనిపిస్తుంది. సందర్శకులను విమానం అనుభూతితో మైమరిచేలా చేస్తున్నా ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌ మరెక్కడో లేదు. గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరా నగరంలోని తర్సాలీ బైపాస్‌లో కొలువుతీరింది. తాజాగా ఈ రెస్టారెంట్‌ ప్రజలకు ఆహార ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ రెస్టారెంట్‌లో వంటకాలు కూడా స్పెషలే. ముఖ్యంగా కాంటినెంటల్‌, ఇటాలియన్‌, మెక్సికన్‌, థాయ్‌, చైనీస్‌, పంజాబీ వంటకాల మెనుతో భోజన ప్రియులకు నోరూరిస్తోంది. ఈ రెస్టారెంట్‌ ప్రపంచంలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌ థీమ్‌తో రూపొందిన తొమ్మిదవ రెస్టారెంట్.

ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌ను ఓ బెంగళూరుకు చెందిన కంపెనీ నిర్మించింది. రూ.1.40 కోట్లు వెచ్చించి పాతబడిన ఎయిర్‌బస్ 320 విమానాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత విమాన విడిభాగాలను ఒక్కొక్కటిగా వడోదారకు తీసుకువచ్చింది. ఆ తర్వాత వాటిని రెస్టారెంట్‌గా నిర్మించేలా రీమోడలింగ్ చేశారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌ విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు. ఈ రెస్టారెంట్‌లో ఒక్కసారి 102 మంది కస్టమర్లు కూర్చొని తమకు నచ్చిన ఆహారాన్ని ఆరగించవచ్చు. రెస్టారెంట్‌ వెయిటర్లు, సర్వర్లు సైతం ఎయిర్‌హోస్ట్‌లు, స్టివార్డ్స్‌లను తలపించేలా డ్రేస్‌ కోడ్‌ను పాటిస్తారు.

Next Story