ఆయన మూడు వేళ్లను తీసివేశారు
Ailing DMDK party chief Vijaykanth's toes removed. దక్షిణాది నటుడు, దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు
By Medi Samrat Published on 22 Jun 2022 4:30 PM ISTదక్షిణాది నటుడు, దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ఆయన కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కెప్టెన్ విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో పార్టీని స్థాపించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పేలవ ప్రదర్శన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు. ఆయన బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్‌లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.
డీఎండీకే నేతను వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పార్టీ పేర్కొంది. "చికిత్స పూర్తయిన తర్వాత అయన రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది" అని DMDK ప్రకటన చదవబడింది. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులలో ఒకరైన విజయకాంత్ 2005లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. 2006 ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసి 8.4 శాతం ఓట్లను సాధించింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు పెద్ద నాయకులు ఎం కరుణానిధి, జె జయలలిత ల హవా ఉన్నప్పుడు ఆయన పార్టీ ఒక సంవత్సరంలోనే ఎక్కువ ఓట్లను ఆకర్షించగలిగినందున చాలా మంది రాజకీయ పరిశీలకులచే ప్రశంసించబడింది.