ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆగస్టు 14న రాత్రి 8 గంటలకు దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో మాస్ క్యాండిల్ ర్యాలీలు చేపట్టాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రదర్శన లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, డీసీసీ కార్యవర్గం, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాలు, మండల అధ్యక్షులు అన్ని విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వరకు భారీ రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. రాష్ట్ర స్థాయి, రాజధాని, ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు చేపట్టాలంది.
ఇందులో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు తీసిన అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జాతీయ స్థాయి లో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపింది. నెల రోజుల పాటు గడప గడపకు తిరిగి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టాలని ఏఐసీసీ కోరింది. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాల సేకరణ చేయాలని తెలిపింది. రాష్ట్రమంతటా తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలి..అని ఏఐసీసీ రాష్ట్రాలకు సూచించింది.