కల్యాణమండపంలో వధువును వదిలి పారిపోయిన వరుడు.. అసలు విషయం ఏంటంటే?

After the Horse the Groom Ran Away Leaving the Bride. పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో కట్నకానుకల విషయం దగ్గర తేడా రావడం.

By Medi Samrat  Published on  14 Dec 2020 6:40 AM GMT
కల్యాణమండపంలో వధువును వదిలి పారిపోయిన వరుడు.. అసలు విషయం ఏంటంటే?

పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో కట్నకానుకల విషయం దగ్గర తేడా రావడం.. మధ్యలోనే పెళ్లి ఆగిపోవడం చాలా సినిమాలలోనే చూసే ఉంటాం. అచ్చం సినిమాలలో మాదిరిగానే కళ్యాణ మండపంలోనే వధువును వదిలి వరుడు వెళ్లిపోయాడు. కట్నకానుకలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ కూడా అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లిలో లాంఛనంగా కట్నకానుకలను అబ్బాయిలకు సమర్పిస్తుంటారు. ఇక అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఇజ్జత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంచశీల నగర్ ప్రాంతానికి చెందిన రామ్ మోహన్ కుమారుడు మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ యువకుడికి అశోక్ విహార్ కు చెందిన యువతితో పెళ్లి చేయడానికి ఇరు వర్గాల పెద్దలు నిశ్చయించారు. ఇరు కుటుంబ సభ్యులు అనుకున్నట్టుగానే పెళ్లితంతు కార్యక్రమం మొదలైంది.

కళ్యాణ మంటపంలో పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ ఎంతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఇరు వర్గాల కుటుంబ సభ్యుల మధ్య కట్నకానుకల విషయంలో వివాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగి ఇరు కుటుంబ సభ్యులు కొట్టుకొనే స్థాయి వరకు వచ్చారు. ఎవరు ఎంత నచ్చచెప్పినా రాజీకి రాకపోవడంతో ఈ సమాచారం పోలీసులకు అందజేశారు.

ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో వరుడు వధువును కళ్యాణ మంటపంలోనే వదిలి వెళ్ళిపోయాడు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఎంత నచ్చచెప్పినా వరుడి కుటుంబ సభ్యులు వినలేదు. అయితే ఇరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇరువర్గాల సభ్యులతో పోలీసులు మాట్లాడి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎటువంటి ఫలితం కనిపించలేదు.
Next Story
Share it