తమిళనాడులో మూడు భాషల విధానంపై చర్చ తీవ్రరూపం దాల్చడంతో బీజేపీ తమిళనాడు ఆర్ట్ & కల్చరల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రంజనా నాచియార్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ జాతీయతను, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఆరోపించారు.
మూడు భాషల ఫార్ములా కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించిన తరుణంలో రంజన నాచియార్ బీజేపీని వీడారు. హిందీని తప్పకుండా చదివే ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ, తమిళం, ఆంగ్లం అనే రెండు భాషల విధానానికి తమిళనాడు కట్టుబడి ఉంటుందని డిఎంకె పేర్కొంది. హిందీ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయని వాదిస్తూ రాష్ట్రంలోని బీజేపీ నేతలు జాతీయ విద్యా విధానానికి మద్దతు ఇస్తున్నారు.