'420 వాళ్లే.. 400 సీట్లు గెలుస్తామంటున్నారు'.. ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌

420 (మోసం) చేసిన వారే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారని నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ పేరు ప్రస్తావించకుండా అన్నారు.

By అంజి  Published on  18 March 2024 9:08 AM IST
Actor Prakash Raj, BJP, PMModi,  Lok Sabha elections, Nationalnews

'420 వాళ్లే.. 400 సీట్లు గెలుస్తామంటున్నారు'.. ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌

420 (మోసం) చేసిన వారే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని మాట్లాడుతున్నారని నటుడు ప్రకాష్ రాజ్ ఆదివారం బీజేపీ పేరు ప్రస్తావించకుండా అన్నారు. కర్నాటకలోని చిక్కమంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. 420 చేసిన వారే 400 సీట్లు వస్తాయని మాట్లాడతున్నారని, అది ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, మరేదైనా అహంకారానికి అద్దం పడుతోందన్నారు. 400 సీట్లకు పైగా గెలిచి ఎన్‌డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఇటీవలి ప్రకటనలపై విరుచుకుపడిన నటుడు, "ప్రజాస్వామ్యంలో" ఒక పార్టీ 400 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే "అవకాశం" లేదని అన్నారు.

"ప్రజలు మీకు సీటు ఇస్తేనే మీరు గెలవగలరు. ఏ రాజకీయ పార్టీ కూడా తాము ముందుకు వెళ్లి సీట్లు తీసుకుంటామని చెప్పలేవు. దానిని అహంకారం అంటారు" అని ప్రకాష్ రాజ్ అన్నారు. 400 సీట్లతో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి లోక్‌సభలో ప్రధాని మోదీ సమాధానమిస్తూ, “మన మూడవ పదవీకాలం ఎంతో దూరంలో లేదు, గరిష్టంగా 100-125 రోజులు మిగిలి ఉన్నాయి. దేశం మొత్తం ‘అబ్కీ బార్, 400 పార్’ అంటోంది అని అన్నారు.

ఫిబ్రవరి 2న రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే చేసిన వ్యాఖ్యను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ , ఇప్పటికే మెజారిటీ ఉన్న బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాల్లోకి దూసుకెళ్తోందని అన్నారు. అలాగే బీజేపీకి ఒంటరిగా 370 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్పారు

Next Story